జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » యూపీలో అడుగుపెట్టే హక్కు ఆయనకుంది: ప్రణబ్ (Pranab Mukherjee| Manmohan Singh| Arunachal Pradesh| Uttar Pradesh| China| UPA)
Feedback Print Bookmark and Share
 
Pranab
FILE
అరుణాచల్ ప్రదేశ్‌లో దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ అడుగుపెట్టరాదని చైనా శాసించడం ముమ్మాటికీ భారత్ అంగీకరించే విషయం కాదని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఓ పార్టీ నాయకుడిగా యూపీలో అడుగుపెట్టడానికి సర్వస్వాతంత్ర్యాలు ఉన్న మొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అని, యూపీలో అడుగుపెట్టే హక్కు ప్రధానికి ఉందని ప్రణబ్ ఉద్ఘాటించారు.

చైనాతో సరిహద్దు సమస్యకు చర్చలే సరైన పరిష్కారమని ప్రణబ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనాతో ఈ వివాదం ఈనాటిది కాదని, 1914 నుంచి చైనా మెక్‌మోబన్ రేఖను అంగీకరించడం లేదని ప్రణబ్ గుర్తు చేశారు.

అయితే సరిహద్దులో చైనా చొచ్చుకొస్తోందని, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ అంశాలలో దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోందని ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదని ప్రణబ్ కొట్టిపారేశారు. అలాగే చైనా సరిహద్దు అంశంపై యూపీఏ మెతకవైఖరి వల్లనే చైనా విజృంభిస్తోన్న వాదనను కూడా ప్రణబ్ తోసిపుచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.