ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » హస్తం గెలుపు: ఇక్కడ చిరంజీవి.. అక్కడ రాజ్‌థాక్రే (Raj Thakery | has done | What | Chiru did | AP | MNS | Congress | Victory)
మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడానికి ప్రధాన కారకంగా ఉపయోగపడిన వ్యక్తి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధిపతి రాజ్‌థాక్రే. అలాగే, మన రాష్ట్రంలో వైఎస్సార్ తిరిగి రెండోసారి పదవిలోకి రావడానికి దోహదపడిన వ్యక్తి సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఉపకారం ఒక్కటే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోగా, మన రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో రాజ్‌థాక్రే పార్టీ వల్ల శివసేన-భాజపా కూటమి తీవ్రంగా నష్టపోయింది. ఓట్లు గణనీయంగా చీలిపోవడం వల్ల ఈ కూటమి అభ్యర్థులు అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇదే పరిస్థితి మన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరిగింది. ప్రజారాజ్యం పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల అతి తక్కువ ఓట్లతో ఓడిపోయి అధికారానికి దూరమయ్యారు.
ఇదే విషయాన్ని భాజపా ఉపాధ్యక్షుడు గోపీనాథ్ ముండే కూడా చెప్పారు. ఎంఎన్ఎస్ 13 సీట్లలో గెలుపొందినప్పటికీ.. ఐదు నుంచి ఆరు శాతం ఓట్లను కైవసం చేసుకుంది. ప్రజారాజ్యం పార్టీ పొందిన ఓట్ల శాతంతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ.. శివసేన కూటమి అధిక సంఖ్యలో సీట్ల కోల్పోయేందుకు దోహదపడింది.