జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహారాష్ట్ర, హర్యానా ఫలితాలపై రాహుల్ ప్రభావం (Rahul gandhi | visible impact | Maha | Haryana | Voters | Polling | Results)
Feedback Print Bookmark and Share
 
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో రాహుల్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు రోజుల పాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం చేశారు. వీటిలో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేసింది.

రాహుల్ ప్రచారం చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రమే పరాజయం పాలయ్యారు. మహారాష్ట్రలో కలమ్మూరీ, తియోసా, యావత్మల్, చంద్రపూర్, పన్వేల్, పూణె కంటోన్మెంట్, షహద, ఔరంగాబాద్‌లలో రాహుల్ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. వీటిలో ఒక్క చంద్రపూర్ మినహా అన్ని చోట్లా ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

ఇద్దరు సిట్టింగ్ సభ్యులు గెలుపొందగా, కొత్తగా ఐదుగురు అభ్యుర్థులు గెలుపొందారు. ఈ ఐదు కొత్త స్థానాల్లో మూడు భాజపాకు చెదినవి కాగా, మిగిలిన రెండింటిలో ఒకటి శివసేన, మరొకటి రైతులు, కార్మికుల పార్టీ నుంచి కైవసం చేసుకున్నారు. అలాగే హర్యానా రాష్ట్రంలోనూ రాహుల్ ప్రచారం చేసిన స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయంసాధించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.