ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఐదు విడతలుగా జరుగనున్న జార్ఖండ్ ఎన్నికలు (Jharkhand | Assembly | Elections | Five-phase | Chief Election Commissioner | Navin Chawla)
జార్ఖండ్ శాసనసభ ఎన్నికలు ఐదు విడతలుగా జరుగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చే నెల 27 నుంచి ఐదు విడతలుగా ఎన్నికలు జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.
ఐదు విడతలుగా జరిగే ఈ ఎన్నికలు నవంబర్ 27న తొలి విడతగా జరుగనుంది. అలాగే డిసెంబర్ నెల 2, 8, 12, 18 తేదీలలో ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 23న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం కమీషనర్ నవీన్ చావ్లా వెల్లడించారు.