జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడిన పాక్ బలగాలు (Pakistan | India | Indo-Pak | Poonch District | Jawan Injured | ceasefire)
Feedback Print Bookmark and Share
 
పాకిస్థాన్ బలగాలు మరోమారు హద్దు మీరాయి. ఇరు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని శనివారం ఉల్లంఘించారు. పూంఛ్ జిల్లాలోని మెంధర్ సెక్టార్‌లో ఏకపక్షంగా భారత బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒక భారత జవాను గాయపడ్డారు.

మెంధర్ సెక్టార్‌లోని క్రిపాన్ పోస్ట్ వద్ద పాక్ బలగాలు జరిపిన కాల్పులకు ఎల్‌ఎంజీ, ఎంఎంజీలను ఉపయోగించినట్టు భారత ఆర్మీ అధికారులు ఆరోపించారు. సరిహద్దు ప్రాంతమైన మెంధర్‌లో శనివారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల మధ్యలో 500 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం తెలుసుకున్న భారత దళాలు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓం బహదూర్ అనే జవానును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న విషయం తెల్సిందే. గత సెప్టెంబరు 21వ తేదీన ఇది జిల్లాలో 135 రౌండ్ల పాటు కాల్పులకు పాల్పడ్డాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.