జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఇస్రో ఛైర్మన్‌ మాధవన్ నాయర్ వారసుడు కె.రాధాకృష్ణన్ (ISRO | Madhavan Nair | K.Radhakrishnan | Engineer | Tiruvantapuram)
Feedback Print Bookmark and Share
 
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ మాధవన్ నాయర్ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన వారసునిగా కె.రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం తిరువనంతపురంలోని విక్రమ్‌సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి సంచాలకుడిగా వ్యవహిస్తున్నారు.

సీనియర్ శాస్త్రవేత్త, ఏవియానిక్స్ నిపుణుడైన రాధాకృష్ణన్ కేరళ వాసి. ఈయన 1970లో కేరళ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేయగా, బెంగుళూరు ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి డాక్టరేట్ పొందారు. ఇస్రోలో 1971లో ఏవియానిక్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన అంచలంచెలుగా పైకి ఎదికారు.

ఈ ఎంపికపై రాధాకృష్ణన్ స్పందిస్తూ.. మరింత పెద్దబాధ్యతలను అప్పగించడం ఎంతో సంతోషంగా ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ అంచలనాలకు తగ్గట్టుగా ఇస్రో బృందాన్ని నడిపించడం తన గురుతర బాధ్యత, లక్ష్యం అని అన్నారు. కాగా, ప్రస్తుత ఛైర్మన్ మాధవన్ నాయర్ కూడా కేరళవాసే కావడం గమనార్హం. ఈయన ఈనెలాఖరుతో పదవీ విరమణ చేయనున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.