జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అరుణాచల్ సీఎంగా దూర్జీ ఖండూ ప్రమాణ స్వీకారం (Dorjee Khandu | Maharashtra | Haryana | Itanagar | Hooda | Ashok Chawan)
Feedback Print Bookmark and Share
 
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దూర్జీ ఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జేజే.సింగ్ ప్రమాణ చేయించారు. అరుణాచల్ ప్రదేస్ కాంగ్రెస్ శాసనసభ (సీఎల్పీ) నేతగా ఖండూ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే.

ఆ వెంటనే ఆయన రాష్ట్ర గవర్నర్‌ సింగ్‌తో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి 42 సీట్లు వచ్చిన విషయం తెల్సిందే.

అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం అశోక్ చవాన్, హర్యానా సీఎం అభ్యర్థిగా భూపేంద్ర హూడా‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్టు సమాచారం. వీరిలో హుడాను ఇప్పటికే హర్యానా కొత్త ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నాయి. దీంతో ఆయన కూడా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర సీఎంగా అశోక్ చవాన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.