ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » చవాన్‌కు బర్త్‌డే గిఫ్ట్: మహారాష్ట్ర సీఎంగా ఎంపిక! (Ashok Chavan | Maharashtra | B'day gift | Sharad pawar | Sonia)
చవాన్‌కు బర్త్‌డే గిఫ్ట్: మహారాష్ట్ర సీఎంగా ఎంపిక!
ఆదివారం, 25 అక్టోబర్ 2009( 15:08 IST )
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అడ్వాన్స్‌డ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా రెండోసారి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాగా, మరో మూడు రోజుల్లో అశోక్ చవాన్ తన 51వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మరోమారు సీఎం అభ్యర్థిగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేశారు.
50 సంవత్సరాల మహారాష్ట్ర చరిత్రలో 14వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే, రాష్ట్ర సీఎంగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వారిలో ఐదో వ్యక్తి కావడం గమనార్హం. ఒకటి కంటే ఎక్కువ సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారిలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, శరద్ పవార్, వసంతరావ్ దాదా పాటిల్, ఎస్పీ.చవాన్ (అశోక్ చవాన్ తండ్రి)లు ఉన్నారు.
అలాగే, మరాఠా పీఠాన్ని రెండు సార్లు దక్కించుకున్న తండ్రీ కొడుకులుగా ఎస్బీ.చవాన్, అశోక్ చవాన్‌లు గుర్తింపు పొందారు. ఎంబీఏ పట్టభద్రుడైన చవాన్ జూనియర్ వివాద రహితుడు కావడం గమనార్హం. కాగా, ఈనెల 23వ తేదీన వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
దీంతో సీఎం అభ్యర్థి ఎన్నికలో హైడ్రామా నెలకొంది. ఈ పదవికి అశోక్ చవాన్‌తో పాటు.. సీనియర్ నేతలు నారాయణ్ రాణే, మహారాష్ట్ర పీసీసీ చీఫ్, కేంద్ర మంత్రులు, విలాస్ రావ్ దేశ్‌ముఖ్, పృథ్విరాజ్ చౌహాన్, సుషీల్ కుమార్ షిండేలు ఉన్నారు. వీరిని వెనక్కి నెట్టి చవాన్ అధిష్టానం ఆశీస్సులు పొందారు.