ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేసులో అజిత్ పవార్! (NCP | Maharashtra | Pawar | Ajit Pawar | Deputy CM | Front Runner | Congress)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ముందజంలో ఉన్నారు. అలాగే సీఎం అభ్యర్థిగా అశోక్ చవాన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీఎల్పీ సమావేశం సోమవారం జరుగనుంది. ఇందులో తమ నేతను కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు.
కాగా, ఉపముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న ఎస్సీపీ మరోవైపు కీలక మంత్రిత్వ శాఖలను కోల్పోనుంది. ఎందుకంటే... అసెంబ్లీలో బలాబలాను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ కూర్పు ఉంటుందని కాబోయే ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తేల్చి చెప్పారు. అదేసమయంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే మద్దతును స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
కాగా, 288 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 144 సీట్లను దక్కించుకుంది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 82 సీట్లు, ఎన్సీపీకీ 62 సీట్లు వచ్చాయి. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 68, ఎన్సీపీకి 71 సీట్లు ఉన్నాయి. దీంతో గత మంత్రివర్గంలో ఎన్సీపీకి చెందిన వారు 24 మంది, కాంగ్రెస్ తరపున 19 మంది మంత్రులు ఉన్నారు.