ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా చగన్ భుజ్‌బల్ (NCP | Maharashtra | Pawar | Dy CM | Congress | Bhujbal | Ashok Chawan | CM)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా చగన్ భుజ్‌బల్
సోమవారం, 26 అక్టోబర్ 2009( 19:25 IST )
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా చగన్ భుజ్‌బల్ ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం జరిగిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా భుజ్‌బల్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రభుత్వంలో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగనున్నారు.
అంతకుముందు.. ఎన్సీపీ సీఎల్పీ నేతగా ఆ పార్టీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు, జల వనరుల శాఖామంత్రి అజిత్ పవార్‌ను ఎన్నుకోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే, సీఎల్పీ సమావేశంలో అనూహ్యంగా చగన్ భుజ్‌బల్‌ను ఎన్నుకున్నారు. ఇకపోతే.. కొత్త ప్రభుత్వంలో స్పీకర్ అభ్యర్థి ఎవరనేది తేలాల్సి వుంది. గత ప్రభుత్వంలో స్పీకర్‌గా బాబాసాహెబ్ కుపేకర్ కొనసాగిన విషయం తెల్సిందే.