జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పాకిస్థాన్ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కృష్ణ (Taliban | Pakistan | SM Krishna | India | Funding | Border | Afghanistan)
Feedback Print Bookmark and Share
 
ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో తిష్టవేసిన తాలిబన్ తీవ్రవాదులకు భారత్ నిధులు సమకూర్చుతోందని పాకిస్థాన్ చేసిన ఆరోపణలను కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ తోసిపుచ్చారు. పాక్ ఆరోపణలు అర్థరహితం. వీటిని పూర్తిగా తోసిపుచ్చుతున్నాం. తాలిబనీకరణం, తాలిబన్లను పూర్తిగా లేకుండా చేయడమే మా ధ్యేయం అంటూ ఆయన సోమవారం బెంగుళూరులో స్పష్టం చేశారు.

రష్యా, భారత్, చైనా (ఆర్ఐసి) సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కృష్ణను మీడియా సంప్రదించి పాక్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ చేసిన ఆరోపణలపై స్పందన కోరింది. తీవ్రవాదులు పాక్‌లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని ఏరివేయాలన్నదే తమ లక్ష్యమన్నారు.

అసంబద్ధ, అర్థరహిత ఆరోపణలు చేయడం పాకిస్థాన్‌కు ఇదేం కొత్తకాదన్నారు. తీవ్రవాదుల ఏరివేతపై వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముంబై దాడులకు సూత్రధారులుగా ఉండి, పాక్‌లో యధేచ్చగా తిరుగుతున్న వారిని అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టాలని కృష్ణ డిమాండ్ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.