జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేడు కాశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మన్మోహన్ (Kashmir | Rail | Manmohan | Jammu High Alret | Rail link Inagurate | PM)
Feedback Print Bookmark and Share
 
ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి బుధవారం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో దేశంలోనే అతిఎత్తైన రైల్వే లైనును ఆయన ప్రారంభించి అనంతనాగ్-ఖాజిగడ్‌ల మధ్య రైలు సర్వీసులకు జెండా ఊపుతారు. సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులో ఈ లైను నిర్మాణం పూర్తి చేశారు.

ప్రధానిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్ లోయను కలుపుతూ 18 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రైలు మార్గాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమలో కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొంటారు. ఇదిలావుండగా, ప్రధాని పర్యటన సందర్భంగా కాశ్మీర్ లోయలో విధ్వంసాలు సృష్టించాలని హిజ్బుల్ చీఫ్ సలావుద్దీన్ తమ శ్రేణులకు పిలుపునిచ్చాడు. దీంతో జమ్మూకాశ్మీర్‌లో హైఅలెర్ట్ ప్రకటించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.