జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కొలువుదీరిన హర్యానా కొత్త అసెంబ్లీ: రేపు బల పరీక్ష (Newly-elected CM | women MLAs | Haryana | take oath | Confidence | Hooda)
Feedback Print Bookmark and Share
 
హర్యానా రాష్ట్ర కొత్త అసెంబ్లీ బుధవారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాతో సహా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. వీరితో ప్రొటెం స్పీకర్ అజయ్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. గురువారం ముఖ్యమంత్రి హుడా ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోనుంది. 90 మంది సభ్యులు కలిగిన హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు 46 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, కాంగ్రెస్ పార్టీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఈ పార్టీకి ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో గురువారం జరిగే బలపరీక్షలో హుడా గట్టెక్కనున్నారు. ఈ పరీక్ష అనంతరం రాష్ట్ర గవర్నర్ జగన్నాథ్ పహాడియా కొత్త సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ సాగుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.