ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పూంఛ్ జిల్లాలో ముగిసిన ఎన్‌కౌంటర్ (Jammu-Kashmir | Terrorists | Lashkar-E-Toiba | COMMANDER | Rashtriya Raifils)
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో గురువారం ఉదయం లష్కర్-ఏ-తొయిబాకు చెందిన కమాండర్‌తోపాటు మరో ఉగ్రవాదిని భారత్‌కు చెందిన భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసు బలగాలు సంయుక్తంగా ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు. భద్రతా దళాల చేతిలో హతమైన వారిలో లష్కర్-ఏ-తొయిబా తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్ అబు ఉమర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి అజ్ఞాత ఉగ్రవాది అని పోలీసులు పేర్కొన్నారు.
ఉమర్ అనే తీవ్రవాది లష్కర్-ఏ-తొయిబా సంస్థలోని స్వయంభూ డివిజనల్ కమాండర్ దావూద్‌కు అత్యంత సన్నిహితుడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఓ వారం క్రితం జరిపిన దాడుల్లో ఇతను తీవ్ర గాయాలపాలై భద్రతా దళాలకు చిక్కకుండా పారిపోయాడని, గురువారం ఉదయం వారిపై దాడులు జరపడంతో అతనిని మట్టుబెట్టినట్లు పోలీసులు వివరించారు.
ఇదిలావుండగా ఉమర్‌ను మట్టుబెట్టిన తర్వాత అతని నుండి రెండు ఏకే రైఫిల్స్, 11 గ్రెనేడ్లతోపాటు 120 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.