జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ప్రజాస్వామ్య పద్దతిలో సమస్యల పరిష్కారం: సోనియా (Sonia Gandi | Kasmir | Public Meeting | Manohan | Rail lane | Indira Gandhi)
Feedback Print Bookmark and Share
 
ప్రతి ప్రాంతంలోనూ సమస్యలు ఉంటాయని, వీటిని ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భారత లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థలో కాశ్మీర్‌కు ప్రత్యేక స్థానం ఉందని ఆమె నొక్కివక్కాణించారు. కాశ్మీర్‌లో మంగళవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రధాని మన్మోహన్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె ప్రసంగింస్తూ.. సమస్యలెపుడూ ఉంటాయి. వాటిని ప్రజాస్వామ్య పద్దతిలో పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. శాంతి నెలకొంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అందువల్ల కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కాశ్మీర్ లోయ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం రైలు మార్గం వేయనున్నట్టు సోనియా ప్రకటించారు.
అనంతరం తన అత్త ఇందిరాగాంధీని గుర్తు చేసి, కాశ్మీర్‌పై ఆమెకు గల ప్రత్యేక అభిమానాన్ని చాటారు. 1984లో అక్టోబరులో చివరిసారి ఆమె ఇక్కడకు వచ్చారన్నారు. కాశ్మీర్‌ను ఆమె చాలా ప్రేమించేవారని చెప్పారు. ముఖ్యంగా, చీనార్ ఆకుల అందాన్ని వీక్షించేందుకు గాను ఆమె ఇక్కడకు వచ్చేవారని సోనియా చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.