ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » సరిహద్దు వివాద పరిష్కారానికి కాలపరిమితి లేదు: కృష్ణ (Border Issue | China | India | Forign | Krishna | Kashmir | Brahmaputra)
సరిహద్దు వివాద పరిష్కారానికి కాలపరిమితి లేదు: కృష్ణ
శుక్రవారం, 30 అక్టోబర్ 2009( 09:21 IST )
భారత-చైనా దేశాల మధ్య దీర్ఘకాలికంగా నెలకొని వున్న సరిహద్దు వివాదం పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ స్పష్టం చేశారు. ఇదో నిరంతర, దీర్ఘకాలిక ప్రక్రియ అని స్పష్టం చేశారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో గురువారం మాట్లాడుతూ.. సరిహద్దుతో పాటు.. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుందన్నారు. అంతవరకు ఓర్పు, సహనం పాటించాల్సిందేనన్నారు.
చైనా విదేశాంగ మంత్రితో మంగళవారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సరిహద్దు అంశం ప్రస్తావనకు వచ్చిందా అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. ఈ వివాదానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం కనుగొనేందుకు ఇరుదేశాలూ వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయని, ప్రత్యేక ప్రతినిధుల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
ముఖ్యంగా.. ఇది దీర్ఘకాలిక ప్రక్రియ అయినందున దానికి నిర్ధిష్ట కాల వ్యవధి ఏమీ నిర్ణయించుకోలేదన్నారు. రెండు దేశాల మధ్య చక్కని సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. చైనా ప్రతినిధితో జరిగిన చర్చల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయం ప్రస్తావనకు రాలేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.