జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మావోయిస్టుల బెడదను తిప్పికొడతాం: ప్రధాని మన్మోహన్ (Moists | PM | Manmohan | Bengal Govt | Mamata Benerjee | Srinagar)
Feedback Print Bookmark and Share
 
దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మావోయిస్టుల దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతామని ప్రధాని మన్నోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ద్విముఖ వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కివక్కాణించారు.

ఆయన గురువారం శ్రీనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరోవైపు అభివృద్ధి కుంటుపడకుండా చూడాల్సి ఉందని గుర్తు చేశారు. ఏ తరహా సామాజిక, ఆర్థిక అభివృద్ధికైనా సమాజంలో శాంతి భద్రతలు నెలకొనడం కీలకమన్నారు. అయితే, ఈ శాంతికి మావోలవిఘాతం కలిగిస్తున్నారని వాపోయారు.

మావోలు అపహరించిన పోలీసు అధికారి విడుదలకు అరెస్టు చేసిన నక్సలైట్లను బెయిలుపై విడుదల చేయాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఒక్క బెంగాల్‌లోనే కాకుండా పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల బెడద ఉందన్నారు. ఈ ముప్పును సమర్థవంతంగా తిప్పికొడతామని ప్రధాని తేల్చి చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.