జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఐఓసీలో అగ్నిప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య (IOC | Fire Accident | Fire | Sitapura industrial | Jaipure | Murali Deora)
Feedback Print Bookmark and Share
 
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా గాయాలపాలయ్యారు. గురువారం అర్ధరాత్రి సితాపురా పారిశ్రామి ప్రాంతంలోని ఈ డిపోలో ఆకస్మికంగా భారీ ఎత్తున మంటలు అంటుకున్నాయి. పెట్రోల్ పైపు లీకేజీ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు.

ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు 35 అగ్నిమాపక శకటాలు, సిబ్బంది రాత్రి నుంచి శ్రమిస్తున్నారు. అయినా మంటలను అదుపుచేయలోక పోతున్నారు. సహాయకచర్యల్లో 20 అంబులెన్స్‌లు కూడా పాల్గొంటున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా సమీపంలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదు లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

కాగా, ప్రమాద వార్త తెలుసుకున్న కేంద్ర పెట్రోలియం శాఖామంత్రి మురళీ దేవ్‌రా జైపూర్‌కు పయనమయ్యారు. ఐఓసీ ఛైర్మన్, హెచ్‌పీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మృతుల కుటుంబాలకు రాజస్థాన్ ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.