జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » దలైలామా మా రాష్ట్ర అతిథి: అరుణాచల్ సీఎం ఖండూ (Dalai Lama | state guest | Arunachal CM | Dhorji Khandu | PM | China | India)
Feedback Print Bookmark and Share
 
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తమ రాష్ట్ర అతిథి అని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దూర్జీ ఖండూ స్పష్టం చేశారు. వచ్చే నెల ఏడో తేదీ నుంచి దలైలామా వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది.

దీనిపై సీఎం ఖండూ మాట్లాడుతూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చే దలైలామాకు అన్ని రకాల ప్రోటోకాల్స్‌తోపాటు.. గట్టి భద్రతను కూడా కల్పిస్తామని తెలిపారు. తమ రాష్ట్ర అతిథిగా వస్తున్న ఆయన తవాంగ్, ఈటానగర్‌లతో పాటు.. ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు.

దలైలైమా అరుణాచల్ ప్రదేశ్‌లో చేపట్టిన పర్యటనను చైనా నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. అయితే.. ఆసియాన్-ఇండియా అండ్ ఈస్ట్ ఆసియా సమ్మిట్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దలైలామా తమ ప్రత్యేక అతిథి అని చైనా ప్రధాని సమక్షంలోనే తేల్చి చెప్పిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.