ప్రపంచ దేశాలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి కూడా సోకింది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు వైద్యులు నిర్థారించారు.
రష్యా పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం ఆయనలో స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని వైద్యులు చెప్పారు. దీంతో నరేంద్రమోడీని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న నరేంద్ర మోడీకి జరిపిన స్వైన్ ఫ్లూ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని వైద్యులు చెప్పారు.
దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌లో సీఎం స్థాయి నేత నరేంద్రమోడీ స్వైన్ ఫ్లూ బారిన పడటం ఇదే తొలిసారి.