జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జైపూర్ మృతులకు రూ.2లక్షల నష్టపరిహారం (Jaipur| Indian Oil Corporation| Depot| Fire Accident| Exgresia| Murali Deora| Rajastan)
Feedback Print Bookmark and Share
 
జైపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి సితాపురా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ డిపోలో ఆకస్మికంగా భారీ ఎత్తున మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే.

పెట్రోల్ పైపు లీకేజీ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా పరిశీలించారు.

ఈ సంఘటనపై ప్రస్తుత పరిస్థితిని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయాలకు గురైన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 5 నుంచి 10లక్షల వరకు నష్ట పరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. ఈ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 15కి చేరింది. మంటలను అదుపులోకి తీసుకురావడం మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు సాయశక్తులా కృషి చేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.