ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » "సుఖోయ్" యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రయాణం! (President | Pratibha Patil | Sukhoi | Abdul Kalam | IAF | Armed Forces)
భారత నౌకా దళానికి చెందిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రయాణించనున్నారు. వైమానికదళంలో అగ్రశ్రేణి యుద్ధ విమానాలుగా ఖ్యాతిగడించిన సుఖోయ్ -30 ఎంకేఐ రకం యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించనున్నారు. ఇదే నిజమైతే.. సుఖోయ్ విమానంలో ప్రయాణించే తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు.
ఈ అరుదైన ఘట్టం వచ్చే నెలాఖరు నాటికి ఆవిష్కృతం కానుంది. 74 సంవత్సరాల ప్రతిభా పాటిల్‌కు ఓ ట్రేడ్ మార్క్ ఉంది. భారతీయ వస్త్రాధారణలోని భాగమైన చూడముచ్చటైన చీరలో కనిపించే ఆమె.. ఇందుకోసం తన రెగ్యూలర్ వస్త్రాధారణను పక్కన పెట్టి జి-సూట్‌ను ధరించనున్నారు.
కాగా, దేశ సాయుధ త్రివిధ దళాలకు రాష్ట్రపతి అధిపతిగా ఉన్న విషయం తెల్సిందే. సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ త్వరలోనే ప్రయాణిస్తారు. ఈ అరుదైన ఘట్టం వచ్చే నెలాఖరులో జరుగనుందని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు ఆయన నిరాకరించారు.
రాష్ట్రపతిగా పని చేసిన అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలాం 2006లో జలాంతర్గామిలో ప్రయాణించిన విషయం తెల్సిందే. ఆయన అడుగుజాడల్లో ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ప్రయాణిస్తున్నారు. ఇందులోభాగంగా ఆమె పుణెలోని లోహిగాయ్ కేంద్రంగా సుఖోయ్ విమానంలో ప్రయాణించనున్నారు.