జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జార్ఖండ్ శాసన సభకు రేపు నోటిఫికేషన్ జారీ! (Jarkhand | Assembly | Notification | Election | Vote | counting | Results)
Feedback Print Bookmark and Share
 
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. మొత్తం 81 స్థానాలు కలిగిన జార్ఖండ్ శాసనసభకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఐదు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకోసం షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే.

ఐదు దశల్లో భాగంగా.. తొలి విడత ఎన్నికలు 30 స్థానాలకు వచ్చే నెల 25వ తేదీన జరుగుతాయి. రెండో విడత డిసెంబర్‌ 2న 15 శాసనసభ స్థానాలకు, మూడో విడత డిసెంబర్‌ 8వ తేదీన ఏడు స్థానాలకు, నాలుగో విడత డిసెంబర్‌ 12వ తేదీన 14 స్థానాలకు, డిసెంబరు 18వ తేదీన జరిగే ఐదో దశ ఎన్నికల్లో 15 శాసనసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

ఓట్ల లెక్కింపు డిసెంబరు 23వ తేదీన జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. డిసెంబర్‌ 31వ తేదీతో జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఈసీ వెల్లడించిన ప్రకటనలో పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.