జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రుక్సానా ఇంటిపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు (Lashkar-e-Toiba | Jammu-Kashmir | Ruksana | Durgastami | Rajouri | Collector)
Feedback Print Bookmark and Share
 
జమ్మూ-కాశ్మీర్‌లో లష్కర్-ఏ-తొయిబా ఆధునిక దుర్గగా పేరుగాంచిన రుక్సానా ఇంటిపై శుక్రవారం రాత్రి దాడులకు పాల్పడ్డారు.

దేశమంతా దుర్గాష్టమి, దుర్గా నవమి పండుగ ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో జమ్మూ-కాశ్మీర్‌లోని రుక్సానా ఇంట్లోకి జొరబడ్డ లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఇద్దరు తీవ్రవాదుల్లో ఓ తీవ్రవాదిని ధైర్యంగా మట్టుబెట్టిన రుక్సానా వార్తల్లోకెక్కి సంచలనం సృష్టించింది. దీనికి ప్రతీకారంగా ఆమె ఇంటిపై శుక్రవారం రాత్రి లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు.

ఉగ్రవాదులు శుక్రవారం తన ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని రజౌరీ జిల్లాకు చెందిన కలెక్టర్ ఎస్.జయపాల్ సింగ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రజౌరీ జిల్లాలోని థానామండీలోనున్న రుక్సానా ఇంటిపై తీవ్రవాదులు శుక్రవారం రాత్రి గ్రెనేడ్లు విసిరారని, ఆ సమయంలో ఇంట్లో రుక్సానాతోపాటు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ఆయన అన్నారు.

ప్రస్తుతం వారు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్నారని, వారికి తాము ప్రభుత్వ ఆదేశాల మేరకు భద్రత కల్పించామని ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.