ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ప్రముఖులు (25th death anniversary | Former prime minister | Indira Gandhi | blood donation camps | AICC | Shakti Sthal |)
భారతదేశ మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ ఇందిరా గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని జాతి అమెకు ఘనంగా నివాళులర్పించింది.
మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని శక్తిస్థల్‌లోని ఆమె స్మారక చిహ్నం వద్ద ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి కౌర్, కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ, ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రియాంక గాంధీ, వధేరా, తదితరులు నివాళులర్పించారు.
ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు మృతికి సంబంధించిన ఘటనల పోటోలతో దేశవ్యాప్తంగా ఫోటో ఎగ్జిబిషన్, జాతీయ సమైక్యతా ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, ఆమె చరిత్రకు సంబంధించిన 42 నిమిషాల నిడివిగల సినిమాను ప్రదర్శించి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జయంతి నటరాజన్ న్యూ ఢిల్లీలో శనివారం వివరించారు.