ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament| Winter Conference| Pranab Mukherjee| Christmas| November| December)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 21వ తేదీతో ముగుస్తాయి.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ నెలాఖరులో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందుగా ముగిస్తాయి.
ఈసారి బడ్జెట్ సమావేశాలు ముగిసే సరికి.. ఉభయసభలు దాదాపు వందసార్లు సమావేషం కాగలవని కేంద్రం, ప్రతిపక్షాలు భావిస్తాయి. అంతేగాకుండా.. ఏడాదిలో కనీసం 110 రోజులు సమావేశాలు జరగాలని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ కూడా ఆశించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పి.కె. బన్సాల్ తెలిపారు.