జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఢిల్లీ రండి: అసమ్మతివాదులకు భాజపా అధిష్ఠానం పిలుపు (Karnataka | Bharatiya Janata Party | B S Yeddyurappa | Janardhana Reddy | Delhi | patch up | Arun Jaitley)
Feedback Print Bookmark and Share
 
కర్నాటకలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భాజపా అధిష్ఠానం నడుం బిగించింది. అసమ్మతివాదులు అక్కడా... ఇక్కడా తిరగకుండా నేరుగా ఢిల్లీ రావాలనీ, సమస్యలను ఇక్కడే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చింది.

మరోవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు లేదని తేల్చి చెప్పింది. చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఏవైనా ఉన్నట్లయితే ఢీల్లీ పార్టీ కార్యాలయంలో కూచుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించింది.

యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాల్సిందేనని "గాలి" సోదరులు పట్టుబట్టిన నేపధ్యంలో అరుణ్ జైట్లీ రంగంలోకి దిగారు. సమస్యలపై చర్చించేందుకు అసమ్మతి నేతలందరూ ఢిల్లీకి రావాలని సూచించారు.

ఢిల్లీకి పిలుపు వచ్చిన నేతల్లో కర్నాటక రాష్ట్ర టూరిజం మంత్రి జనార్థన రెడ్డి, ఆయన సోదరుడు రెవిన్యూ మంత్రి జి. కరుణాకర్ రెడ్డి, ఆరోగ్యశాఖా మంత్రి శ్రీరాములుతోపాటు అసెంబ్లీ స్పీకర్ జగదీష్ షెట్టార్ ఉన్నట్లు సమాచారం.

అధిష్ఠానం చెప్పినట్లు నడుచుకుంటామని "గాలి" సోదరులు ఇంతకుముందే ప్రకటించిన నేపధ్యంలో కర్నాటక సంక్షోభం సమసిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.