జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కోలుకుంటున్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ (Gujarat Chief Minister Narendra Modi| Condition improves| Swine flu| H1N1 Virus| Cold| Cough| Fever)
Feedback Print Bookmark and Share
 
Narendra Modi
FILE
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సోకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి నుంచి ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

రష్యా పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశం చేరుకున్న నరేంద్ర మోడీ జలుబు, జ్వరంతో బాధపడటంతో ఆయనకు జరిపిన స్వైన్ ఫ్లూ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం చికిత్స పొందుతోన్న నరేంద్ర మోడీని శనివారం పరీక్షించిన వైద్యులు అతుల్ పటేల్ మాట్లాడుతూ.. జ్వరం తగ్గుముఖం పట్టిందని, దీనికి తోడు స్వైన్ ఫ్లూ నుంచి ఆయన మెలమెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. ఇంకా జలుబు, దగ్గుల తీవ్రత నుంచి మోడీ క్రమంగా కోలుకుంటున్నారని అతుల్ పటేల్ అన్నారు.

అందుచేత మోడీ ఆరోగ్య విషయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఇంకా స్వైన్ ఫ్లూకు తగిన మందులను ఆయనకు అందజేస్తున్నామని, వారం రోజులు విశ్రాంతిలో ఉండాల్సిందిగా సూచించామని అతుల్ పటేల్ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. స్వైన్‌ఫ్లూతో బాధపడుతోన్న నరేంద్ర మోడీ.. గాంధీనగర్‌లోని ఆయన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. దీంతో నరేంద్ర మోడీ పాల్గొనాల్సిన కార్యక్రమాలు, ఆయన పుట్టిన రోజుల వేడుకను కూడా రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.