ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఇస్రో ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించి రాధాకృష్ణన్ (ISRO | Chairmen | Post | Tiruvananthapuram | VSSC | Kerala | Thrissur)
ఇస్రో ఛైర్మెన్‌గా రాధాకృష్ణన్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు రాధాకృష్ణన్ తిరువనంతపురంలోనున్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(విఎస్ఎస్‌సీ) డైరెక్టర్‌గావున్నారు.
ఇదివరకు ఇస్రో ఛైర్మెన్‌గానున్న మాధవన్ నాయర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త అయిన రాధాకృష్ణన్‌ను ప్రభుత్వం నియమించింది.
దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగిన ఆయన చంద్రయాన్-1 ప్రయోగంలో కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను తీసుకునే ఈ బాధ్యతలు చాలా కీలకమైనవని, తన తోటి శాస్త్రజ్ఞుల బృందంతో కలిసి మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించిపెడతానని, దీంతో దేశం గర్వించేలా తన సేవలుంటాయని ఆయన వెల్లడించారు.
తనకు అప్పజెప్పిన బాధ్యతలను తాను కచ్చితంగా నిర్వర్తిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలోనున్న ఇరింజాలాక్కుడా గ్రామంలో పుట్టారు. ఇతను ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో పట్టాపుచ్చుకుని 1973 నుంచి విఎస్ఎస్‌సీలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు.
ఐఐఎమ్ బెంగుళూరునుండి ఎమ్‌బీఏ చేసిన తర్వాత ఐఐటీ ఖరగ్‌పుర్ నుంచి డాక్టరేట్ ఉపాధిని పొందారు.