బాలీవుడ్ బిగ్ బీ పేరొందిన అమితాబ్ బచ్చన్‌కు గత కొంత కాలంగా ఓ అజ్ఞాత వ్యక్తి బెదింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని బిగ్ బీ తన అధికారిక బ్లాగు.. బిగడ్డాడాట్‌కామ్‌లో వెల్లడించారు. ఇటీవలే అమితాబ్.. హిందూ దేవాలయాలను, ముస్లింల దర్గాలను సందర్శించారు.
తనకు కొద్ది రోజులుగా వస్తున్న ఫోన్‌కాల్స్‌లో ఈ సందర్శనలను దుండగుడు... తీవ్రంగా విమర్శించినట్లు అమితాబ్ పేర్కొన్నారు. దీనికి తోడు అమితాబ్ ఇటీవలే 'అలాదీన్' అనే చిత్రంలో నటించారు. ఇందులో ఓ ముస్లిం పాత్రలో అమితాబ్ కనబడతారు.
అమితాబ్ గత కొన్నేళ్లుగా ముంబైలోని హాజీ అలీ దర్గాను సందర్శిస్తున్నారు. ఇక ఈ బెదింపు కాల్స్‌ను ఉద్ధేశించి అమితాబ్ తన బ్లాగులో ఈ విధంగా వివరించారు. పెద్దగా ప్రచారం లేని తన ఈ బ్లాగును దుండుగుడు చూస్తున్నట్లయితే.. అతనికి ఇదే తన సమాధానంగా తెలిపాడు.
తాను చెయ్యాలనుకున్నదే చేస్తాను.. మళ్లీ మళ్లీ సందర్శనలు చేస్తాను.. తనను ఆపగలిగే దమ్ము, ధైర్యం ఉంటే వచ్చి తనను కలుసుకోవలసిందిగా అమితాబ్ బెదిరింపు ఫోన్ కాల్స్‌కు సమాధానంగా హెచ్చరించాడు. ఈ విషయాలన్నింటినీ అమితాబ్ తన బ్లాగులో తెలిపాడు.
అయితే తనకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్న వ్యక్తి ఎవరో.. అతని పేరు కూడా తెలుసునని.. అతని నెంబర్ తన వద్ద ఉందని అమితాబ్ వెల్లడించారు.