జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » అరుణ్ జైట్లీతో సమావేశమైన కర్నాటక స్పీకర్ (State | Home minister | Advani | Rajnadh Singh | Yadyurappa | Sushma Swaraj | Gali | BJP)
Feedback Print Bookmark and Share
 
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంలో రేగిన "గాలి" దుమారం ఇంకా కొనసా..గుతోంది. అసమ్మతికి నేతృత్వం వహిస్తున్న శాసనసభాపతి జగదీష్ షెట్టర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీతో సమావేశమైనారు.

కర్నాటక ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం కారణంగా అసమ్మతికి నాయకత్వం వహిస్తున్న ఆ రాష్ట్ర స్పీకర్ జగదీష్ షెట్టర్ ఆదివారం న్యూ ఢిల్లీలో కర్నాటక బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అరుణ్ జైట్లీతో సమావేశమైనారు.

ఇదిలావుండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప అనుచరుడు, రాష్ట్ర హోంశాఖామంత్రి ఆచార్యా పార్టీ అగ్రనాయకులైన అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లను కలుసుకున్నారు.

కాగా నాయకత్వాన్ని మార్చి తీరాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నా అధిష్టనం మాత్రం యడ్యూరప్పవైపే మొగ్గు చూపిస్తోంది. గతంలో పార్టీని క్షేత్ర స్థాయిలో చక్కబెట్టి, రాష్ట్రంలో బీజేపీకి అధికారమిచ్చిన ఆయనను పార్టీ వదులుకోదని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.