ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » స్వైన్‌ఫ్లూ నివారణకు రూ. 124 కోట్ల మందులు (Swain Flu | H1N1 | Health Dept | Director | P.Ravindran | TamiFlu)
ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న మహమ్మారి వ్యాధి స్వైన్‌ఫ్లూ నివారణకు దాదాపు రూ. 124 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నివారించేందకుగాను రూ. 123.89 కోట్ల విలువ చేసే టామీ ఫ్లూ మందులను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ డైరెక్టర్ పి. రవీంద్రన్ తెలిపారు.
నాలుగు కోట్ల టామీ ఫ్లూ క్యాప్స్యుల్స్, నాలుగు లక్షల వ్యాధినిరోధక మందులు కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇవి స్వైన్‌ఫ్లూను నివారించేందుకు ఉపయోగపడతాయని ఆయన వివరించారు.
తాము కొనుగోలు చేసిన మందులు హెచ్1ఎన్1 వైరస్‌ను నిరోధిస్తుందని, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 13 వేల 381 మందికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని, ఇందులో 472 మంది మృతి చెందారని ఆయన పేర్కొన్నారు.