ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మావోయిస్టులు ఆయుధాలు పట్టకూడదు: చిదంబరం (Maoists, Wepons | Revolution | Peace | Oath | P.Chidambaram | Home Minister)
తన చివరి శ్వాస ఉన్నంత వరకు మావోయిస్టులు ఆయుధాలు పట్టుకుని విప్లవాన్ని సృష్టించలేరని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం అన్నారు.
మావోయిస్టులకు శాంతి సందేశం ఇచ్చి రెండు రోజులైన తర్వాత తన చివరి శ్వాస ఉన్నంత వరకు మావోయిస్టులు ఆయుధాలు పట్టుకోనివ్వని ఆదివారం శపథం చేశారు.
ఆదివారం మదురైలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ... తన జీవితంలో చివరి రక్తపుబొట్టు వరకు భారతదేశంలో ఆయుధాలు చేతబూనిన మావోయిస్టులు, ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించలేరని ఆయన స్పష్టం చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గడచిన 10 నుంచి 13 సంవత్సరాల కాలంలో నక్సలిస్టులు పెరిగిపోయారన్నారు.
ఇప్పుడు అదే నక్సలైట్లు తమ చేతుల్లో ఆయుధాలను చేతబూని ప్రభుత్వాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాని వారి ఆట కట్టిపెడతానని ఆయన అన్నారు.
ఒకవేళ వారు హింసను విడనాడితే మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నక్సల్స్ తమ దేశస్తులేనని, పాక్ ఉగ్రవాదుల్లా వారు మనకు శత్రువులు కారని ఆయన చెప్పారు.