జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కేంద్రం ఆహ్వానిస్తే భారత్‌కు వస్తా: ఎంఎఫ్ హుస్సేన్ (Govt | Hussain | Painter | Arab | Home Ministry | Chidambaram | Supreme Court)
Feedback Print Bookmark and Share
 
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం స్వదేశానికి రావాలని తనను ఆహ్వానిస్తేనే భారత్‌కు వస్తానని ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఆయన కుంచె నుంచి జాలువారిన పలు చిత్రలేఖనాలపై పలు వివాదాలు చెలరేగాయి. దీంతో ఆయనపై హిందుమత పెద్దలు పలు కేసులు పెట్టారు. ఈ కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో... ఆయన దేశం విడిచిపెట్టి అరబ్‌లో నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆయనపై నమోదైవున్న కేసులపై ఓ నివేదికను కేంద్ర హోంశాఖ తయారు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం నుంచి తనకు పిలుపు అందిన మరుక్షణం భారత్‌కు వస్తానని స్పష్టం చేశారు.

ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కేసులకు త్వరగా ముగింపు పలికేందుకు కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. తన చిత్రాల కారణంగా తలెత్తిన విభేదాల పరిష్కారానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు. దీనిపై చిదంబరాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.