జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహారాష్ట్ర అసెంబ్లీలో 143 మంది కొత్త సభ్యులు! (Maharashtra | Assembly | New Members | Congress | NCP | MNS | BJP)
Feedback Print Bookmark and Share
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 288 మంది సభ్యుల్లో సగం మంది అంటే.. 143 మంది కొత్తవారే కావడం గమనార్హం. ఇంత భారీ సంఖ్యలో కొత్త సభ్యులు సభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారని విధాన సభ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇందులో 33 మంది కొత్త సభ్యులతో కాంగ్రెస్‌ ప్రథమ స్థానంలో ఉంది. మిగిలిన పార్టీల్లో శివసేన తరపున 29, ఎన్‌సీపీ తరపున 22, భాజపా తరపున 22, ఎంఎన్‌ఎస్ తరపున 12, నలుగురు ఎస్పీ సభ్యులు, 16 మంది స్వతంత్ర అభ్యర్థులు అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టనున్నారు.

ఇదిలావుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా జాప్యం నెలకొనివుంది. మంత్రిత్వ శాఖల పంపిణీలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఫలితంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం నెలకొంది.

కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీ.. ఆర్థికం, హోం, ప్రజాపనులు, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవి వంటి శాఖలను కావాలని పట్టుబట్టింది. దీనికి కాంగ్రెస్ ససేమిరా అంటోంది. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఎన్సీపీ కంటే కాంగ్రెస్‌ బలం ఎక్కువగా ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.