ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కిడ్నాపైన డాక్టర్లను కనిపెట్టండి.. లేదా సమ్మె తప్పదు! (Doctors Kidnap | Doctors strike | IMA | Bihar | Samastipur)
కిడ్నాపైన డాక్టర్లను కనిపెట్టండి.. లేదా సమ్మె తప్పదు!
కిడ్నాప్‌కు గురైన డాక్టర్లను ఎక్కడున్నారో కనిపెట్టకపోతే.. బీహార్‌లో వైద్య సేవలను నిలిపివేస్తామని భారత మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సోమవారం హెచ్చరించింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఇద్దరు డాక్టర్లు కిడ్నాప్‌కు గురై 48 గంటలు కావస్తున్న నేపథ్యంలో.. ఐఎంఏ ఈ హెచ్చరికలు చేసింది.
కిడ్నాప్ అయిన డాక్టర్లను కనిపెట్టలేకపోవడం పోలీసుల వైఫ్యల్యంగా పేర్కొంటూ.. ఐఎంఏ నిరసనలు వ్యక్తం చేసింది. సమస్తిపూర్‌లోని సహపూర్ పటౌరీ నుంచి వస్తున్న వైద్యులు.. ఏకే సహాయ్, సంతోష్ కుమార్‌లు శనివారం సాయంత్రం నుంచి కనబడటం లేదు. వీరిద్దరూ ఐఎంఏలో వైద్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వైద్యులు కిడ్నాప్‌కు గురై 48 గంటలు కావస్తున్న దీన్ని చేధించలేకపోవడం.. పోలీసుల వైఫల్యంగా సమస్తిపూర్ అధికార వర్గాలు తెలిపాయి. అయితే కిడ్నాప్‌కు గురైన వైద్యులిద్దరి వాహనాలను పోలీసులు స్వాధీన పరుచుకున్నారని.. అక్కడి నుంచి పోలీసులు వెతుకులాట ప్రారంభించినట్లు వివరించాయి.
ఈ ఆపరేషన్ హంట్ కోసం.. ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపినట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రసాద్ తెలిపారు. మరోవైపు.. ఆస్తుల వివాదాల వల్లే.. ఈ కిడ్నాప్ నాటకం ఉండొచ్చని గల్లంతైన వైద్యుల కుటుంబాలు వెల్లడించాయి. కాగా, బీహార్‌లో కిడ్నాప్‌లు ఇటీవల కాలంలో సర్వ సాధారణమైపోయాయి.
పోలీసు వర్గాల వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 45 మందికి పైగా కిడ్నాప్‌కు గురై ఉంటారని తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో 32 మంది కిడ్నాప్ గురయ్యారు. నాలుగు నెలల క్రితం.. 2001 మరియు 2009లలో సుమారు 2,167 మంది పిల్లలు కిడ్నాప్‌కు గురైనట్లు బీహార్ ప్రభుత్వమే ఇటీవల స్వయంగా ప్రకటించింది.
ఇందులో.. 1,752 మంది తిరిగి ఇంటికి చేరుకోగా.. 75 మంది హతులయ్యారు. అయితే మిగిలిన 340 మంది జాడ ఇంకా తెలియలేదని బీహార్ ప్రభుత్వం తెలిపింది.