జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మరాఠీలో ప్రమాణ స్వీకారం: రాజ్‌థాక్రే హెచ్చరిక (Raj Thackeray Marathi | MLAs | MNS | SP | Congress | BJP |, Sivasena)
Feedback Print Bookmark and Share
 
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే కొత్త ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేశాడు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులందరూ మరాఠీలో ప్రమాణ స్వీకారం చేయాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనకు సభ సాక్ష్యంగా నిలుస్తుందని సోమవారం హెచ్చరించారు.

మొత్తం 288 మంది సభ్యులు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంఎన్ఎస్ తరపున 13 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన విషయం తెల్సిందే. వీరిలో రాజ్‌థాక్రే కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త సభ సభ్యుల ప్రమాణ స్వీకారంపై రాజ్‌థాక్రే హెచ్చరిక చేశారు. అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేసే ప్రతి సభ్యుడు మరాఠీలోనే ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు.

అలాకానీ పక్షంలో తమ పార్టీ నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో కన్నడలో ప్రమాణ స్వీకారం చేయని మరాఠీయుడిని సభ నుంచి వెలి వేశారని గుర్తు చేశారు. ఇలాంటి వైఖరినే మన సభ్యులు కూడా అనుసరించాలని సూచించారు.

ఇదిలావుండగా, ఎస్పీ సభ్యుడు ఆసీం ఆజ్మీ అసెంబ్లీ సెక్రటరీకి ఒక లేఖ సమర్పించారు. జాతీయ భాష హిందీ అని, అందువల్ల హౌస్ అజెండా హిందీలో ఉండేలా రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ భాష తర్వాతే ఏ ఇతర భాష అయిన వస్తుందని పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.