జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ప్రత్యేక పోలీసు అధికారిణిగా రుక్సానా కౌసర్ (Ruksana Kowser | Lashkar-e-Toiba | Terrorists | Maharnavami | Modern Durga | Jammu-Kashmir | SPO)
Feedback Print Bookmark and Share
 
లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఉగ్రవాదిని మహర్నవమినాడు హతమార్చిన తర్వాత వార్తల్లో ఆధునిక దుర్గగా నిలిచిన కాశ్మీరీ వీర వనిత రుక్సానా కౌసర్ ప్రత్యేక పోలీసు అధికారిణి (ఎస్‌‌పీఓ)గా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

రజౌరీ జిల్లా ఎస్‌పీఓగా రుక్సానా కౌసర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని రజౌరీ జిల్లా సీనియర్ ఎస్‌పీ షఫ్‌కత్ వట్టాలీ విలేకరులకు తెలిపారు.

ఈమె సెప్టెంబర్ 27న పాకిస్థాన్ దేశంలోని లష్కర్-ఏ-తొయిబా తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదిని ధైర్యంగా ఎదుర్కొని చంపేసిందని, అలాగే మరో తీవ్రవాది తీవ్రగాయాలతో పారిపోయాడని ఆయన వివరించారు. ఆమె ధైర్యానికి మెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను రాష్ట్రానికి వినియోగించుకోవాలని కోరుకుందని ఆయన తెలిపారు.

రుక్సానాతోపాటు ఆమె సోదరుడు ఏజాజ్, ఆమె పినతండ్రి బకాలత్ హుస్సేన్‌లను కూడా ఇటీవలే పోలీసుల ఉద్యోగాలలో నియమించడం జరిగిందని, వారు తమ విధి నిర్వహణలో సంతృప్తికరమైన ఫలితాలను చూపుతున్నారని ఆయన అన్నారు.

ఇదిలావుండగా రుక్సానా భద్రతా కారాణాలతో ఢిల్లీలో నివసిస్తుందని కొన్ని వార్తా సంస్థలు చేసిన ప్రచారం అబద్దమని, రాష్ట్ర ప్రభుత్వం ఆమె సేవలను ఉపయోగించుకునేందుకు పోలీసు శాఖలో ఇటీవలే నియమించిందని ఆయన తెలిపారు.

అఖిల భారతీయ ఉగ్రవాద నిర్మూలన ఫ్రంట్ ఇచ్చిన సాహసి అవార్డును తీసుకునేందుకుగాను ఆమె ఢిల్లీకి వెళ్ళారని, అవార్డు కార్యక్రమం గతంలో నిర్ణయించిన మేరకు పునాలో జరగాల్సివుందని, కాని ప్రస్తుతం అది ఢిల్లీలో జరుగుతోందని, దీనికిగాను ఆమె ఢిల్లీ వెళ్ళారని ఆయన వివరించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.