జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 20 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి (Finally | CJI | Other SC judges | Assets | public | Delhi High Court | RTI | KG)
Feedback Print Bookmark and Share
 
ఎన్నో వివాదాల అనంతరం ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన 20 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను బహిరంగ పరిచారు. వీరిలో ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు. వీరి ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

సుప్రీం ఇతర న్యాయాస్థానాల జడ్జీలు తమ ఆస్థులను వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా కోరడం జరిగింది. దీనిపై కొన్ని నెలల పాటు వాద, ప్రతివాదనలు చోటుచేసుకున్నాయి. చివరకు చీఫ్ జస్టీస్ కేజీ.బాలకృష్ణన్ ముందుకు రావడంతో మరికొంత మంది న్యాయమూర్తులు కూడా ఆయనతో చేరారు.

అయితే, ఉన్నత న్యాయమూర్తులకు చెందిన ఆస్థుల వివరాల వెల్లడి వంటి నిబంధనలు సమాచార హక్కు చట్టం కింద వర్తించవంటూ ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో విభేదిస్తూ సుప్రీం న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడం గమనార్హం.

సుప్రీం చీఫ్ జస్టీస్‌కు ఒక సాంత్రో కారు, 20 సవర్ల బంగారు నగలు, రూ.18.08 లక్షల విలువ చేసే స్థిరాస్తులున్నట్టు పేర్కొన్నారు. అలాగే కేరళ రాష్ట్రంలోని థ్రిక్కాకరలో 15 సెంట్ల విస్తీర్ణంలో ఒక గృహం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.