ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కొనసాగుతున్న మహా సంక్షోభం: గవర్నర్‌తో చవాన్ భేటీ! (Maharashtra | Ashok Chavan | Chhagan Bhujbal | NCP | Congress | Governer)
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ సీఎల్పీ నేత అశోక్ చవాన్ ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్సీ.జమీర్‌తో భేటీ అయ్యారు. ఆయనతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభ అంశంపై చర్చలు జరిపారు.
ఇదిలావుండగా, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్‌ను కూడా గవర్నర్ ఆహ్వానించారు. అశోక్ చవాన్‌తో చర్చలు ముగిసిన తర్వాత గవర్నర్ జమీర్ భుజ్‌బల్‌ను ఆహ్వానించి సంక్షోభంపై చర్చిస్తారు.
అయితే ఈ ఇద్దరు నేతలను గవర్నర్ ఆహ్వానించడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదా ప్రత్యేక అజెండా ఏదీ లేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ రోజు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావచ్చని వార్తలు కూడా వస్తున్నాయి.
అక్టోబరు 13వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలై 13 రోజులు అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న చిక్కులు మాత్రం ఇంకా వీడలేదు. కాగా, అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 82 సీట్లను కైవసం చేసుకోగా, ఎన్సీపీకి 62 సీట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుంది.