జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ముంబై తరహా దాడులు జరగవచ్చు: ఆర్మీ చీఫ్ (Army Chief | warns | 26/11-type | attacks | Deepak Kapoore | Mumbai | Pakistan)
Feedback Print Bookmark and Share
 
దేశంలో ముంబై తరహా దాడులు మరిన్ని జరగవచ్చని దేశ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 26/11 తరహా దాడులు మరిన్ని జరుగవచ్చు. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం అవరసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

దక్షిణాసియాలో తీవ్రవాద కార్యకలాపాలు నానాటికీ ఎక్కువ అవుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ వంటి దేశాలు తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

పాకిస్థాన్‌లో వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు జరుగుతున్నందువల్ల దేశంలో ఇలాంటి తరహా దాడులు జరుగకుండా అన్ని చర్యలు చేపట్టాలని రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ, హోం మంత్రి చిదంబరంలు భద్రతా బలగాలను హెచ్చరించారని దీపక్ కపూర్ ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.