ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మత విద్వేషాల వల్లే బాబ్రీ కూల్చివేత: మంత్రి చిదంబరం (Babri Mosque | Chidambaram | Mainority | Muslim | Attack | Heritage | UP)
మత విద్వేషాల వల్లే బాబ్రీ కూల్చివేత: మంత్రి చిదంబరం
బుధవారం, 4 నవంబర్ 2009( 09:00 IST )
మత విద్వేషాల వల్లే బాబ్రీ మసీదును ఓ వర్గం కూల్చి వేసిందని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. మనం చేపట్టే చర్య మతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండరాదని, దీనికి ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో మైనారిటీ వర్గ ప్రజల సంక్షేమాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్నివేళలా ముందు ఉంటుందన్నారు. మైనార్టీలకు హాని జరిగే విధంగా దేశం వారిని నిర్లక్ష్యం చేయదన్నారు. బహుళజాతుల సమ్మేళనమే మన వారసత్వం, బలం. మైనార్టీలను రక్షించాల్సిన బాధ్యత మెజార్టీ సమాజానిదే. కొందరి చర్యల వల్లే భిన్నత్వంలో విభేదాలొస్తున్నాయని అన్నారు.
పలు దేశాల్లో మైనారిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం కానివ్వబోమన్నారు. శ్రీలంకలో తమిళుల హక్కులను తిరస్కరించడం, ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్న ప్రస్తుతం సమయంలో ముస్లింల హక్కుల కోసం మాట్లాడేందుకు తమకెలాంటి సంకోచమూ లేదని అన్నారు.