ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌పై దాడికి లష్కర్ కుట్ర: ఎఫ్‌బీఐ (LeT | Headley | FBI | NDC | Chicago | US | Court | Guilty | Sentence)
నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌పై దాడికి లష్కర్ కుట్ర: ఎఫ్‌బీఐ
బుధవారం, 4 నవంబర్ 2009( 12:14 IST )
దేశంలోని జాతీయ సైనిక కళాశాల (నేషనల్ డిఫెన్స్ కాలేజ్)పై తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా కుట్ర పన్నినట్టు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించింది. ఇందుకోసం లష్కర్ తోయిబా నేతలు వ్యూహం పన్నారని తెలిపింది. గత నెలలో ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన డేవిడ్ కలోమన్ హెడ్లీ, తహువర్ హుస్సేన్ రాణాల వద్ద జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైనట్టు ఆ సంస్థ ప్రకటించింది.
కాగా, రాణా దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్‌ను చికాగో కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించేందుకు హాజరైన న్యాయవాది వాదిస్తూ.. రాణా అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని, ఇలాంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేయరాదని కోరారు. ఒకవేళ ఆయనను బెయిల్‌పై విడుదల చేస్తే భవిష్యత్‌లో మరిన్ని దారుణాలు చవిచూడాల్సి వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ కేసులో రాణా దోషిగా తేలిన పక్షంలో కనీసం 30 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్టు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్‌లో పుట్టిన కెనడా జాతీయుడు చికాగోలో నివశిస్తున్నాడు. అమెరికా పౌరుడైన హెడ్లీ స్నేహితుడు. వీరిద్దరు కలిసి వెళుతుండగా ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. వీరిద్దరిపై డెన్మార్క్‌తో పాటు భారత్‌లో దాడుల కేసుల్లో అరెస్టు చేశారు. వీరద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో భారత్‌లో ఉన్న నేషనల్ డిఫెన్స్ కళాశాలపై దాడి చేయాలని వ్యూహం పన్నారని తెలిపింది. ఈ సమాచారాన్ని ఇతర వ్యక్తులకు పంపాలని (గుర్తు తెలియని లష్కర్ లీడర్) రాణా హ్యాడ్లీని కోరినట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది.