జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » విముక్తి ప్రాంతం అబూజ్‌మడ్‌కు ఎందుకింత ప్రచారం! (Chattisgarh | Naxalites | Govt | Paramilitery force | Bastar Forest | Bengal)
Feedback Print Bookmark and Share
 
అబూజ్‌మడ్.. ఈ పేరు వింటేనే పలు రాష్ట్ర పోలీసు యంత్రాంగాలను హడల్. మావోయిస్టులకు కేంద్ర స్థావరం. ఇక్కడ తిష్టవేసిన నక్సలైట్లు బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఒరిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంపై కేంద్రం గురిపెట్టింది.

నక్సలైట్ ప్రాబల్య రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ అడవుల్లో నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అబూజ్‌మడ్ ఉంది. అబూజ్‌మడ్‌ అంటే నిగూఢ ప్రదేశమని అర్థం. బ్రిటీష్‌వారి కాలం నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం ఎటువంటి సర్వేకూ నోచుకోలేదు. ఆ పని చేసేందుకు కేంద్ర రాష్ట్రాలు కూడా సాహసం చేయలేదు. అందువల్లే ఈ ప్రాంతాన్ని విముక్తి ప్రాంతంగా ప్రకటించింది.

ఇక్కడే మావోయిస్టులు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడదు. అయితే, అబూజ్‌మడ్‌లో ఏముందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గత యేడాది ఏరియల్ సర్వే నిర్వహించింది.

బాహ్య ప్రపంచం, అభివృద్ధి, సంక్షేమాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఇక్కడ 238 గ్రామాలున్నట్టు గుర్తించింది. వీటిలో 190 గ్రామాలు బీజాపూర్‌ జిల్లాలోనూ, ఎనిమిది గ్రామాలు దంతెవాడ జిల్లాలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మడియా జాతి ఆదివాసీలు 30 వేల మందికిపైగా ఉన్నట్టు వెల్లడించింది. ఆదివాసీల్లో అత్యధికులు పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ సభ్యులుగా ఆయుధాల వినియోగంలో శిక్షణ పొందినట్టు కేంద్ర, రాష్ట్రాలు అంచనా వేస్తున్నాయి.

అంతేకాకుండా, మావోయిస్టులకు అవసరమైన ఆయుధాలను తయారు చేసుకునేందుకు అవసరమైన నాలుగు ఆయుధ తయారీ కర్మాగారాలు, నాలుగు శిక్షణా కేంద్రాలున్నాయని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ ప్రాంతంలో తిష్టవేసిన నక్సల్స్‌ను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం 40 వేల మంది పారా మిలిటరీ బలగాలు, అత్యాధునిక హెలికాఫ్టర్లతో "ఆపరేషన్ గ్రీన్ హంట్"ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌ ఎన్ని రోజులు సాగుతుందో...ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.