జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » వందేమాతరాన్ని రాజకీయం చేయద్దు: భాజపాకు వినతి (BJP | SP | Vande Mataram | JUI | Amar Singh | Rajbabbar | Chidambaram)
Feedback Print Bookmark and Share
 
వందేమాతర జాతీయ గేయాన్ని రాజకీయం చేయవద్దని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి సమాజ్‌వాదీ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రతి చిన్న అంశాన్ని పెద్దదిగా చేసి చూపడం భాజపా నైజంగా మారిపోయిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్‌లో దేవ్‌బాండ్‌లో జరిగిన జేయూఐ జాతీయ సమావేశంలో వందేమాతర గేయాన్ని ఆలపించరాదని పేర్కొంటూ.. ఫత్వా జారీ చేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు ఈ జేయూఐ సమావేశంలో ఒక తీర్మానం చేయగా, భాజపా మండిపడింది. ఈ అంశంపై ఎస్పీ నేత అమర్ సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. అది మతపరంగా తీసుకున్న నిర్ణయన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.

దీని పరిష్కారం కోసం ఓ మధ్యేమార్గాన్ని కనుగొనాలని సూచించారు. వందేమాతరానికి ముస్లిం సోదరులు వ్యతిరేకం కాదు. మతపరమైన ఒత్తిడి వల్లే అలా తీర్మానం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, భాజపాతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం చేయరాదని, అలా చేస్తే దేశంలోని రెండు వర్గాల అంతరం పెరుగుతుందన్నారు.
అలాగే, కేంద్ర హోంమంత్రి చిదంబరం సమక్షంలోనే ఈ తీర్మానం చేసినట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ఈ సమావేశానికి మంత్రి హాజరుకావడాన్ని తప్పుబట్టలేమన్నారు. ఇకపోతే.. ఈనెల ఏడో తేదీన జరుగనున్న ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బాలీవుడ్ స్టార్ రాజ్‌బబ్బర్ ప్రచారం చేయడంపై అమర్ సింగ్ స్పందిస్తూ.. రాజ్‌బబ్బర్ తమ పార్టీ తరపున ఒకసారి రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు వెళ్లారని గుర్తు చేశారు.

ఆయన ఎస్పీ అధినేత ములాయం సింగ్ కోడలుపై పోటీ చేయలేరుగా అని అన్నారు. ఈ స్థానం నుంచి గెలుపొందిన ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.