జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మధుకోడా ఇంటిని సీజ్ చేసిన ఐటీ శాఖ అధికారులు (Madhukoda | House | Hawala | Bjp | Jarkhand | Ranchi)
Feedback Print Bookmark and Share
 
జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఇంటిని ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. పలు ఆర్థిక నేరాలతో పాటు.. హవానా మోసానికి పాల్పడినందుకు గాను ఆయన కార్యాలయాలపై ఇటీవల ఐటీ శాఖ దాడులు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ దాడుల్లో ఆయన పాల్పడిన ఆర్థిక నేరాలకు సంబంధించి పలు ఆధారాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో.. కేసులకు సంబంధించి ఆయన వద్ద విచారణ జరిపేందుకు ఐటీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే విచారణను నుంచి తప్పించుకునేందుకు మధుకోడా సరికొత్త ఎత్తులు వేశారు. కడుపు నొప్పి అధికం కావడం, రక్తపోటు పెరగడం వంటి సాకులతో రాంఛీ ఆస్పత్రిలో చేరారు.

దీనిపై అబుర్‌ రజాక్‌ మెమోరియల్‌ వీవర్స్‌ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ.. పరీక్షలు చేశామని, రిపోర్టులు రావాల్సి వుందన్నారు. ఫలితాలు వెల్లడైన తర్వాత రోగ నిర్ధారణ జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధి జావీద్‌ అక్తర్‌ చెప్పారు.

అయితే, ఈనెల ఆరో తేదీ నాటికి తమ ముందు హాజరై కొన్ని లావాదేవీలు, పరిణామాల గురించి వివరించాలని కోడా సన్నిహితులుగా భావిస్తున్న ఆరుగురికి ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా హాజరు కాకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలావుండగా, బుధవారం ఐటీ అధికారులు రాంచీలోని ఆయన నివాసాన్ని సీజ్ చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.