ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 'వందేమాతరం' ఇస్లాంకు వ్యతిరేకం కాదు: ముస్లిం గ్రూపులు (Vandemataram | Islam Muslim groups | Fatwa | Jamait Ulema E Hind)
'వందేమాతరం' ఇస్లాంకు వ్యతిరేకం కాదు: ముస్లిం గ్రూపులు
'వందేమాతరం' ఇస్లాంకు వ్యతిరేకం కాదని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రముఖ ముస్లిం గ్రూపులు గురువారం వెల్లడించాయి. వందేమాతర జాతీయ గీతం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ.. జమాయిత్ ఉలేమా ఇ హింద్ రెండు రోజుల క్రితం ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫత్వా జారీ అయిన రెండు రోజుల తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధాన ఇస్లాం గ్రూపులు.. వందేమాతరం ఇస్లాంకు వ్యతిరేకంగా ఏమీ లేదంటూ తేల్చి చెప్పడం విశేషం. ఈ పాటను ఉర్ధూలోకి తర్జుమా చేశామని.. ఇందులో ఇస్లాం వ్యతిరేకతను తెలిపే ఎలాంటి వాక్యాలు ఉన్నట్లుగా తమకు కనబడలేదని ఆ గ్రూపులు తెలిపాయి.
మధ్యప్రదేశ్‌లోని ఆల్ ఇండియా ముస్లిం తివార్ కమిటీ (ఏఐఎంటీసీ), నేషనల్ సెక్యులరిజం ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఎఫ్ఐ)లు ఈ తీర్మానం చేశాయి. వందేమాతర గీతంలో.. దేశం సంక్షేమం గురించి ప్రస్తుతిస్తూ చేసిన ప్రార్థనగా మాత్రమే ఉందని వివరించాయి. భోపాల్‌లో ఏఐఎంటీసీ ఛైర్మన్ ఓసాఫ్ షామీరి ఖుర్రామ్ మాట్లాడుతూ, 'వందేమాతరం' ఇస్లాంకు వ్యతిరేకం కాదన్నారు.
ఎందుకంటే.. స్వాతంత్ర్య సమరంలో వందేమాతర గీతాన్ని ఆయుధంగా చేసుకుని అనేక మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారని వివరించారు. వందేమాతరం అన్నది దేవతను పూజించే ప్రార్థన గీతం కాదన్నారు. అది దేశ సంక్షేమాన్ని కోరుతూ.. ఆలపించేదిగా తెలిపారు.