జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మధు కోడా నేడు విడుదలు: ఏ క్షణమైనా అరెస్టు! (Madhu Koda | Jarkhand | Ranchi | House | IT | Hawala | National | Ex CM)
Feedback Print Bookmark and Share
 
జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను ఆదాయాపన్ను శాఖ అధికారులు ఏక్షణమైనా అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. హవాలా కుంభకోణంలో చిక్కుకున్న ఆయనను ఐటీ అధికారుల విచారించారు. దీన్ని నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యం సాకు చూసి ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే.

ఆ రాష్ట్ర రాజధాని రాంచీలోని అబ్దుల్ రజాక్ మెమోరియల్ వీవర్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, శుక్రవారం డిశ్చార్జ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ఇప్పటికే, హవాలా కుంభకోణానికి సంబంధించి రాంఛీలోని ఆయన గృహాన్ని సీజ్ చేసిన విషయం తెల్సిందే. అంతేకాకుండా గత ఐదు రోజులుగా ఆయన నివాసంలో ఐటి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఎడతెగని తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్పత్రి పాలైన మధు కోడాను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చామని, ఆయన ఇంకా కడుపు నొప్పితో బాధ పడుతున్నారని ఆస్పత్రి సూపరింటెండ్ సిన్హా తెలిపారు. మధు కోడ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిన తర్వాత తమ దర్యాప్తు పునఃప్రారంభమవుతుందని ఐటీ అధికారులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.