జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » తీవ్రవాదిని హతం చేసిన రుక్సానాకు జాతీయ అవార్డు! (Terrorist | National | Award | Ruksana | J&K | Vohra | Omar Abdulla)
Feedback Print Bookmark and Share
 
ఉగ్రవాదిని హత్య చేసి దేశ మీడియా దృష్టిని ఆకర్షించిన కాశ్మీర్ వనిత రుక్సానా కౌసర్ (22)కు జాతీయ సాహస అవార్డును ఇవ్వాలని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ వీఎన్.వోహ్రా కేంద్రానికి సిఫార్సు చేశారు. అలాగే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాశారు.

గత సెప్టెంబర్‌ 27వ తేదీన తమ ఇంటిపై దాడి చేసిన ఉగ్రవాదులను అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన రుక్సానా, తన సోదరుడితో కలిసి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత వోహ్రా, లాంఛనంగా రుక్సానాకు సాహస అవార్డు కోసం కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాను ఆ లేఖలో కోరారు.

తమ ఇంటిలో చొరబడిన ఇద్దరు మిలిటెంట్లపై రుస్కానా తన సోదరునితో కలిసి తిరుగుబాటు చేయడమే కాకుండా, వారి చేతుల్లో ఉన్న ఏకే-47 రైఫిల్‌ను తీసుకుని ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక మిలిటెంట్ ప్రాణాలు కోల్పోగా, మరో మిలిటెంట్ ప్రాణాలతో పారిపోయాడు. ఈ ఘటనతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు రుక్సానాను ప్రత్యేకంగా అభినందించిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.