జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రేపు ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్: సర్వం సిద్ధం! (Seven States | By Poll | Polling | CEC | UP | Loksabha | Election | Counting)
Feedback Print Bookmark and Share
 
ఏడు రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక లోక్‌సభకు శనివారం ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థానంతో పాటు 11 శాసనసభ, పశ్చిమబెంగాల్‌లో 10, కేరళలో మూడు, రాజస్థాన్‌, అస్సోంలలో రెండేసి స్థానాలు, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఈ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, ఓట్ల లెక్కింపు ఈనెల పదో తేదీన జరుగనుంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కన్నౌజి, ఫిరోజాబాద్‌ల నుంచి గెలుపొందిన సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్‌ తనయుడు అఖిలేష్‌ యాదవ్‌ తర్వాత ఫిరోజాబాద్‌ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి అఖిలేష్‌ యాదవ్‌ సతీమణి డింప్‌లేను సమాజ్‌ వాదీ పార్టీ బరిలో దించగా, ఆ పార్టీ మాజీ ఎంపి రాజ్‌ బబ్బర్‌ను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది.

ఈయనకు మద్దతుగా కాంగ్రెస్‌ యువ నేత రాహుల్‌ గాంధీ గత నెల 30వ తేదీన ప్రచారం నిర్వహించగా, అఖిలేష్‌ యాదవ్‌, తన భార్య తరుపున అదే రోజు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాహుల్‌ గాంధీని తాము ప్రేమిస్తామని, కానీ ఫిరోజాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ తమకు నమ్మక ద్రోహం చేసిందని సమాజ్‌ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్‌ సింగ్‌ ఆరోపించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.